Niluvu Dopidi: నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ అన్నదమ్ములుగా నటించిన రెండవ చిత్రం ‘నిలువు దోపిడీ’. అంతకు ముందు వీరిద్దరూ ‘స్త్రీ జన్మ’లో అన్నదమ్ములుగానే అభినయించారు. విశేషమేమిటంటే, ఎన్టీఆర్‌తో కృష్ణ నటించిన ఐదు చిత్రాలలోనూ ఆయనకు తమ్మునిగానే నటించారు. కృష్ణ వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో రూపొందిన ‘నిలువు దోపిడీ’ చిత్రాన్ని ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన యు.విశ్వేశ్వరరావు నిర్మించారు. తరువాతి రోజుల్లో విశ్వేశ్వరరావు కూతురును యన్టీఆర్ తనయుడు మోహన్ కృష్ణ వివాహం చేసుకోవడంతో వారిద్దరూ వియ్యంకులు కూడా…