కరోనా కేసులు ప్రపంచ దేశాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, గతంలో కరోనా మహమ్మారి మనుషులతో పాటుగా జంతువులకు కూడా సోకింది. ఇప్పుడు మరలా జంతువులకు సోకుతున్నది. తాజాగా సింగపూర్‌లోని నైట్ సఫారీ జూలోని నాలుగు సింహాలకు కరోనా సోకింది. గత కొన్ని రోజులుగా ఈ సింహాలకు జలుబు తుమ్ములతో కూడిన ఫ్లూ సోకింది. నాలుగు సింహాలు నీరసించిపోయి కనిపించాయని జూ నిర్వహకులు పేర్కొన్నారు. నైట్ జూ సిబ్బంది ముగ్గురికి కరోనా సోకడంతో…