కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ… నేపాల్‌లో వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. ఆ దేశ రాజధాని ఖాట్మండులో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. మయన్మార్ నేపాల్ దౌత్యవేత్తగా పనిచేసిన భీమ్ ఉదాస్.. తన కుమార్తె మ్యారేజ్‌కు రాహుల్‌ను ఆహ్వానించగా.. ఆయన అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఖాట్మాండులోని నైట్‌క్లబ్‌లో రాహుల్ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నిజానికి ఈ వీడియోను వైరల్‌గా మార్చింది బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూరప్ పర్యటనపై రాహుల్‌గాంధీ విమర్శలు…