ఐసెట్ చివరి విడత కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కొత్తగా కౌన్సిలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు నేడు స్లాట్ బుక్ చేసుకోవాలని కన్వీనర్ మిత్తల్ నవీన్ కోరారు. రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. రేపు, ఎల్లుండి వెబ్ అప్షన్లకు అవకాశం ఉందని తెలిపారు. చంద్రబాబు కుటుంబం పట్ల అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా మౌన ప్రదర్శనలు, దీక్షలు చేపట్టాని పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు టీడీపీ శ్రేణులు…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నిర్ణయంతో 11.56 లక్షల కేంద్ర ఉద్యోగులకు లాభం కలుగనుంది. జనవరి 2022 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. హెచ్‌ఆర్‌ఏ పెరుగనుంది. ఐఆర్‌టీఆఎస్‌ఏ, ఎన్‌ఎఫ్‌ఐఆర్ ఉద్యోగులు డిమాండ్ నేపథ్యంలో హెచ్‌ఆర్‌ఏ పెంపుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎక్స్, వై, జడ్ అంటూ మూడు భాగాలుగా నగరాలను విభజించి, ఎక్స్ భాగానికి రూ.5400, వై భాగానికి…
ఫేస్‌బుక్ వరుసగా ఏదో ఒక వివాదంలో ఇరుకుంటోంది. ఫేస్ బుక్ వినియోగాదారుల డాటా లీక్ అయ్యిందని లాంటి ఆరోపణలతో పలుమార్లు వార్తల్లో నిలిచింది ఫేస్‌బుక్. అయితే వివాదంలో చిక్కకున్న ప్రతి సారి ఆధికంగా నష్టం వాటిల్లడంతో ఫేస్‌బుక్ మాతృసంస్థ పేరు మార్చాలని డిసైడ్ అయ్యారు.. మెటా గా కూడా నామకరణం చేశారు. కానీ ఇప్పుడు ఆ పేరు చిక్కులు తెచ్చిపోట్టింది. అమెరికాకు చెందిన ఓ టెక్ సంస్థ మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ స్క్యూలిక్ కోర్టును ఆశ్రయించారు.…
రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం భూమి కంపించింది. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. మంచిర్యాల జిల్లాలో వారం వ్యవధిలోనే భూమి కంపించడం ఇది రెండో సారి. దీంతో ఆ జిల్లా వాసులు భయాందోళనకుల గురవుతున్నారు. భూకంపం రావడంతో బోగ్గు గనుల్లో ఉన్న కార్మికులను ఖాళీ చేయించారు అధికారులు. వీటితో పాటు కరీంనగర్, వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించడంతో…