సాధారణంగా నవజాత శిశువులను ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి అత్యాధునిక వైద్య చికిత్సలను అందించడం కోసం తరలిస్తుండటం జరుగుతుంటుంది. నవజాత శిశువులను అత్యవసర వైద్య చికిత్స కోసం తరలించే సమయంలో ఈ నవజాత శిశువుల ఆరోగ్యం మరింతగా క్షీణించకుండా చేయడం లేదా అనారోగ్యం బారిన పడకుండా చేసేందుకు అంబులెన్స్‌లో ఐసీయూ వసతులు కావాల్సి ఉంటుంది.