ఇటీవల ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో పేలవమైన ప్రదర్శనతో విమర్శలపాలైంది పాక్ జట్టు. దాన్నుంచి కోలుకోకముందే పాక్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన రెండో టీ20లో సల్మాన్ అఘా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు 11 బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్ జట్టు 0-2 తేడాతో వెనుకబడి పోయింది. దూకుడుగా ఆడిన…