New York Sinking: అమెరికాలో అతిపెద్ద నగరం న్యూయార్క్ దాని బరువును మోయలేకపోతోంది. నగరం వేగంగా కూరుకుపోతోంది. అనుకున్నదానికన్నా వేగంగా న్యూయార్క్ సిటీ నేలలోకి కూరుకుపోతున్నట్లు నాసా రిపోర్ట్స్ తెలిపాయి. నగరంలోని లాగ్వార్డియా ఎయిర్‌పోర్ట్, ఆర్థర్ ఆష్ స్టేడియం, కోని ఐలాండ్ మొదటగా ప్రభావితం అవుతున్నాయని నాసా వెల్లడించింది.
New York Sinking: అమెరికాలోని అతిపెద్ద నగరం, ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్ నెమ్మనెమ్మదిగా భూమిలోకి కూరుకుపోతుందని పరిశోధకలు సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. న్యూయార్క్ లోని అతిపెద్ద భవంతులు క్రమంగా నేలలోకి జారుకుంటున్నాయని పరిశోధన పేర్కొంది. నగరంలోని భవనాల బరువు కారణంగా సమీపంలోని నీటిలోకి మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ పరిస్థితిని సైన్స్ పరిభాషలో ‘ సబ్సిడెన్స్’ అంటారని పరిశోధకులు వెల్లడించారు.