CP Sajjanar: న్యూ ఇయర్ వేడుకలను ఎలాంటి అపశృతి లేకుండా, శాంతియుతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ కీలక వివరాలు వెల్లడించారు. జంటనగరల వ్యాప్తంగా ఈ రోజు రాత్రి మొత్తం 100 డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని, ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదని డీసీపీ సూచించారు. రాత్రి 10 గంటల నుంచి…
Cyberabad Traffic Alert: 2026 నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ నగర వాసులకు విజ్ఞప్తి చేసింది. వేడుకల పేరుతో అతిగా ప్రవర్తించే వారు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డిసెంబర్ 31 రాత్రి సైబరాబాద్ పరిధిలోని అన్ని ప్రధాన రహదారులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 సాయంత్రం 8 గంటల నుంచే సైబరాబాద్ వ్యాప్తంగా…
హైదరాబాద్ పోలీసు కమిషనర్ (సీపీ) వీసీ సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పర్యవేక్షించారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా.. సీపీ పాల్గొని తనిఖీల విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలీసు సిబ్బందికి సూచనలు ఇవ్వడమే కాకుండా.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను సజ్జనార్ వివరించారు. క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్…