యూకే ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అభినందించారు. ఆమె నాయకత్వంలో భారత్-యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ అభినందన సందేశంలో పేర్కొన్నారు.
బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ కన్జర్వేటివ్ నాయకత్వ రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ను ఓడించారు. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఆరు వారాలుగా హోరాహోరీ ప్రచారంతో పాటు పోలింగ్ కూడా పూర్తయింది.