మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. మరో ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన టిపీసీసీ చీఫ్‌గా ఎన్నికైన రేవంత్‌రెడ్డి గత రాత్రి పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డిని కలిశారు. అనంతరం శాననమండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ…
తెలంగాణ పిసిసి అద్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకం కాంగ్రెస్‌లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ ముఖ్య పరిణామం అవుతుంది. ఎడతెగని వివాదాలను అంతర్గత విభేదాలను పక్కనపెట్టి అధిష్టానం రేవంత్‌ను ఎంపిక చేయడంలో ఆయనపై విశ్వాసంతో పాటు ఆ పార్టీ పరిస్తితి కూడా అర్థమవుతుంది. ఎప్పటినుంచో వున్న పిసిపి పీఠం ఆశిస్తున్న హేమాహేమీలను కాదని, గత ఎన్నికల ముందు టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌నే ఎంచుకున్నారంటే కెసిఆర్ ప్రభుత్వాన్ని ఢీకొనగల సత్తా ఆయనకే వుందని నాయకత్వం భావించిందన్న మాట. బండిసంజయ్…