ఆ మాజీ మంత్రి ఇంటిపోరుతో సతమతం అవుతున్నారా? రాష్ట్రస్థాయిలో పార్టీలో కీలకంగా ఉన్నా.. సొంత నియోజకవర్గంలోని పరిణామాలు రుచించడం లేదా? కొత్త తలనొప్పులు వస్తున్నాయా? ఇంతకీ ఎవరా నేత? ఏమా కథ? జహీరాబాద్ కాంగ్రెస్‌లో గ్రూపులతో వేగలేకపోతున్నారా? ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి వరసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గీతారెడ్డి. అంతకుముందు గజ్వేల్‌లో సత్తా చాటారు. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా జహీరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. గత ఎన్నికల్లో గీతారెడ్డిని ఓటమి పలకరించింది. ముగ్గురు…
కాంగ్రెస్‌కు హుజురాబాద్‌లో కొత్త కష్టాలు మొదలయ్యాయి. లోకల్‌పార్టీ నాయకులు సరికొత్త రాగం అందుకున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖకు టికెట్ ఇస్తున్నారని తెలియడంతో.. లోకల్ మంత్రం జపిస్తున్నారట అక్కడి కాంగ్రెస్ నాయకులు. అదే పీసీసీ పెద్దలను చికాకు పెట్టిస్తోందట. హుజురాబాద్ కాంగ్రెస్ నేతల కొత్త రాగం! హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలకు భిన్నంగా వెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అక్కడ ఉన్న ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడం మొదటి లక్ష్యమైతే.. బలమైన అభ్యర్థిని బరిలో దించితే పరువు కాపాడుకోవచ్చన్నది మరో…