శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. ప్రజల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో గత శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అబేవర్థనకు పంపాడు. తాజాగా సంక్షోభం నేపథ్యంలో శనివారం శ్రీలంక పార్లమెంట్ సమావేశం అయింది. గొటబాయ రాజపక్స రాజనీమా లేఖను పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ ధమ్మిక దసనాయకే చదివి వినిపించారు. ‘‘శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక…