సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఏమీ లేదు. జాబితా సాయంత్రం తర్వాత విడుదల అవుతుందన్నారు సజ్జల. సీఎంతో మరో భేటీ ఏమీ లేదు. రాత్రి ఏడు గంటలకు రాజ్ భవన్‌కు జాబితా పంపిస్తాం అని చెప్పారు. మంత్రుల జాబితా ఫైనల్ లిస్ట్ సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి తన టీంని మార్చే పనిలో నిమగ్నం అయినట్టు సమాచారం. జిల్లాలు, కులాలు, మతాలు, విధేయత,పార్టీ పట్ల నిజాయితీ వున్నవారిని ఎంపికచేసి కొత్త కేబినెట్ కూర్పు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత మంత్రుల్లో బెర్త్ ఎవరికి? ఎర్త్ ఎవరికి? అంశం పైన పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో సీఎం జగన్ కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారనే అంశం పైన ఎవరి అంచనాల్లో వారున్నారు. ఏప్రిల్ 11న కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖాయం…
లెక్కలు తారుమారు అవుతున్నాయా? ఎన్నిక ఎన్నికకూ ఈక్వేషన్స్ మారుతున్నాయా? రేస్‌లో ముందున్నవారు.. తాజా లెక్కలతో తారుమారు అవుతారా? ఓటు బ్యాంక్ కోసం.. అధిష్ఠానం అదే ఊపులో వెళ్తే అమాత్య పదవిపై ఆశలుపెట్టుకున్న వారికి నిరాశ తప్పదా? ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారిన సమీకరణాలు..! విశాఖజిల్లా అధికారపార్టీలో పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. స్ధానిక సంస్ధల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు వైసీపీ నిర్ణయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సామాజిక న్యాయం ప్రధానాంశంగా ఇక్కడ పదవుల పంపకం చేస్తోంది…