AP Excise Policy: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాలసీ రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ మద్యం పాలసీ అమలులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాతో పాటు 12 మంది వ్యక్తులపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలపై మంత్రి సిసోడియా నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టిన సీబీఐ.. 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
తెలంగాణలో కొత్త మద్యం పాలసీని కొలిక్కి తెచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది ఎక్సైజ్ శాఖ. దీపావళి తర్వాత దుకాణాలకు టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా రెండేళ్లకోసారి పాలసీ గడవు ముగుస్తుంది. నిజానికి…ఈ అక్టోబర్‌తో గడువు ముగియాల్సి ఉండగా..డిసెంబర్ వరకు పొడిగించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడినందున పాత లైసెన్స్‌లను పొడిగించాల్సి వచ్చింది. దీంతో డిసెంబరు నుంచి కొత్త పాలసీ కూడా అమల్లోకి రానుంది. ఇక…కొత్త పాలసీ విధివిధానాలను ఖరారు చేయడంపై ఉన్నతాధికారులు దృష్టి…