ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పాలనను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవైపు జిల్లాల పునర్విభజనపై వివిధ ప్రాంతాల్లో పలు డిమాండ్లు, అభ్యర్థనలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటిని పక్కకు పెట్టి పాలన అందించడంపైనే దృష్టి పెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సుమారు 11వేల అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాలకు జిల్లా కేంద్రాలు మార్చాలని.. మరికొన్ని జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలని డిమాండ్లలో ఉన్నాయి. ప్రభుత్వానికి వచ్చిన 11వేల డిమాండ్లలో…