రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కోసం కొత్త కస్టమర్లను చేర్చుకోరాదని ఆర్‌బీఐ ఆదేశించింది. అంతేకాకుండా కంపెనీ ఐటీ సిస్టమ్‌ను సమగ్రంగా ఆడిట్ చేసేందుకు ఐటీ ఆడిట్ కంపెనీని నియమించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ ఆడిటర్ల నివేదిక వచ్చే వరకు కొత్త కస్టమర్లను తీసుకోవద్దని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35ఏ ప్రకారం ఆడిటింగ్‌కు ఆదేశించామని స్పష్టం చేసింది. ఒకవేళ ఆన్‌బోర్డు చేయాలంటే ఆర్‌బీఐ ప్రత్యేక…