మన తమిళ స్టార్ హీరో తనదైన అభినయంతో ఎల్లలు చెరిపేసుకుంటూ దూసుకుపోతున్నారు. తొలుత మాతృభాష తమిళంలోనూ, తరువాత అనువాద చిత్రాల ద్వారా తెలుగు, కన్నడ సీమల్లోనూ, ఆ పై మళయాళంలోనూ నటించి అలరించారు. తరువాత హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు ధనుష్. ఇప్పుడు హాలీవుడ్ మూవీ ‘ద గ్రే మేన్’ అనే సినిమాతో జూలై 15న జనం ముందుకు రానున్నారు ధనుష్. ఈ మూవీ విడుదలైన వారానికే అంటే జూలై 22నే నెట్ ఫ్లిక్స్ లో…