UDAN Yatri Cafe: విమానాశ్రయాల్లోకి వెళితే వాటర్ బాటిల్ దగ్గర నుంచి అల్పాహారం వరకు ధరలు మండిపోతుంటాయి. అయితే, వీటికి ఉపశమనం కల్పించేందుకు పౌర విమానయాన శాఖ కీలక చర్యలు తీసుకుంటోంది. కోల్‌కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రయాణికుల కోసం ‘‘ఉడాన్ యాత్రి కేఫ్’’ని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అధిక ధరల్ని నిరోధించడానికి, విమాన యాత్రికులకు అందుబాటులో ధరలు ఉంచాలని లక్ష్యంగా ఈ పైలట్ ప్రాజెక్టుని ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ…