Uttarakhand: యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆర్మీ అధికారి దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్న రామెందు ఉపాధ్యాయ్ అనే వ్యక్తి నేపాల్‌కి చెందిన 30 ఏళ్ల యువతి శ్రేయ శర్మతో మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ కూడా కలిసే ఉంటున్నారు. అప్పటికే పెళ్లైన రామెంద్ ఉపాధ్యాయ్, శ్రేయతో వివాహేతర సంబంధాన్ని నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని శ్రేయ ఒత్తిడి చేయడంతో దారుణంగా చంపేశాడు.