Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ‘‘ఓటు చోరి’’ కొనసాగితే భారతదేశంలో కూడా నేపాల్ లాంటి పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. నేపాల్ రాజకీయాలను ప్రస్తావించారు. "ఇలాంటి ఓట్ల దొంగతనం జరుగుతూనే ఉంటే, పొరుగు దేశాలలో వీధుల్లో కనిపించే వ్యక్తుల మాదిరిగానే, ఇక్కడ కూడా ఇది కనిపించవచ్చు" అని అన్నారు.
Nepal unrest: రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. ఈ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలితో పాటు చాలా మంది మంత్రలు తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు, అల్లర్లలో చాలా మంది లూటీలకు తెగబడ్డారు. ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 51 మంది మరణించారు. మరణించిన వారిలో ఒక భారతీయురాలు కూడా ఉంది.
Nepal: అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత నిర్వహించిన నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో ఒక్కసారిగా యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపింది. సోమవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించడంతో, ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
Nara Lokesh: ఏపీ రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి వాసులు నేపాల్ రాజధాని ఖాట్మండులో చిక్కుకుపోయిన ఘటనపై స్పందించారు. ప్రస్తుతం పశుపతి ఫ్రంట్ హోటల్‌లో 8 మంది మంగళగిరి వాసులు తలదాచుకుని ఉన్నారు. బాధితులు మాచర్ల హేమసుందర్ రావు, దామర్ల నాగలక్ష్మితో మంత్రి నారా లోకేష్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. బాధితులు తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి వద్ద మరో 40 మంది…
Nepal in Turmoil: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. అలాంటి సోషల్ మీడియాను బ్యాన్ చేసింది నేపాల్ సర్కార్.. కానీ.. తరువాత జరిగే హింసాత్మక నిరసనల గురించి అంచనా వేయడంలో విఫలమైంది. నిరసనల ధాటికి హిమాలయ దేశం నేపాల్ అట్టుడుకుతోంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ.. ఉద్రిక్తతలు ఆగడం లేదు. ఈ తరుణంలో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దాంతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది. ఈ…