Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’ ఆరోపణలో గురువారం మీడియా ముందుకు వచ్చారు. కొన్ని ఉదాహరణలు వివరిస్తూ, దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని అన్నారు. కర్ణాటకలో అలంద్ నియోజకవర్గంలో 6000 ఓట్లను తొలగించినట్లు ఆరోపించారు. కేంద్రం ఎన్నికల సంఘం ఓట్ చోరీకి పాల్పడే వారికి అండగా నిలుస్తుందని ఆరోపణలు చేశారు. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తు్న్నారని అన్నారు.
Nepal: నేపాల్‌లో ప్రజాస్వామ్యం అనే ప్రయోగం విఫలమైంది. 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు నేపాల్ ను పాలించాయంటే, అక్కడి అస్థిరత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2008లో ‘‘రాచరికం’’ పోయిన తర్వాత, ప్రజాస్వామ్య దేశంగా మారిన నేపాల్ అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. చివరకు అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయింది.
Supreme Court: సుప్రీంకోర్టు బిల్లులను గవర్నర్లు పెండింగ్‌లో పెట్టే అంశాన్ని విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. బుధవారం సుప్రీంకోర్టులో ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ జరిగింది. రాష్ట్రాలు రూపొందించి బిల్లును క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది.
Helpline Number: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ చిక్కుబడిపోయిన ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో బుధవారం అధికారులు, మంత్రులు సమీక్ష నిర్వహించి పరిస్థితిని సమగ్రంగా చర్యలు చేపడుతున్నారు. సమస్యపై ప్రాథమిక సమాచారం అందించిన అధికారులు, నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సుమారు 241 మంది తెలుగువారూ చిక్కుకుపోయారని తెలిపారు. Nara Lokesh: ఖాట్మండులో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం..! సమాచారం…
Nepal Protests: సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా నేపాల్ అట్టుడుకుతోంది. జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతునున్నారు. ఈ నిరసన హింసాత్మక చర్యలకు దారి తీసింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ ఓలీ నివాసంతో పాటు అధ్యక్షుడి నివాసం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడులు చేసి, నిప్పటించారు.
Nepal PM KP Sharma Oli Resigns: నేపాల్‌లో పరిస్థితి దిగజారుతోంది. నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖాట్మండుతో సహా అనేక ప్రాంతాల్లో నిరసన కారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. నిరసనకారులు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ వ్యక్తిగత నివాసాన్ని ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ నిరసనల నేపథ్యంలో నేపాల్ ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు.
సోషల్ మీడియాపై నేపాల్ లో నిషేధం ఎత్తివేశారు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాపై ఆ దేశం నిషేధం విధించింది. అయితే… అక్కడి ప్రజలు ఆందోళన చేపట్టడంతో… హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నేపాల్ లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధింపుపై నేపథ్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర హింసకు దారితీయడంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ…
Gen Z protest in Nepal: నేపాల్‌లో అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఇటీవల 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించడంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ‘జనరేషన్ – జెడ్ (Gen Z) విప్లవం’గా పేరుపొందింది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంటు సమీపంలో ఘర్షణ పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 16 మంది నిరసనకారులు మరణించగా, వందలాది…