Nepal: నేపాల్‌లో భారత సరిహద్దుల్లో మతహింస చెలరేగింది. మతపరమైన కంటెంట్‌తో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. నేపాల్‌లోని పర్సా జిల్లాలోని బిర్గుంజ్ పట్టణంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. బీహార్ లోన రక్సౌల్ జిల్లాను ఆనుకుని ఉన్న బిర్గుంజ్ నగరంలో అధికారులు కర్ఫ్యూ విధించారు.