Bihar High Alert: నేపాల్ గుండా పాకిస్థాన్‌కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు బీహార్‌లోకి ప్రవేశించారని సమాచారం రావడంతో గురువారం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈసందర్భంగా బీహార్ డీజీపీ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల పోలీసులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నేపాల్ సరిహద్దు గుండా రాష్ట్రంలోకి చొరబడినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని విభాగాల పోలీసులు అలర్ట్‌లో ఉన్నారని తెలిపారు. దేశ వ్యతిరేక శక్తులు…