నెల్లూరు నగర వైసీపీలో విభేదాలు మరోసారి తలెత్తాయి. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మద్దతుదారుడైన హాజీపై అనిల్ వర్గీయులు దాడి చేయడంతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది.
అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే. 2019 నుంచి మొన్నటి క్యేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వరకు రాష్ట్ర మంత్రి. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా అదే సెగ్మెంట్ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టినా.. ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. 2019లో రెండోసారి గెలిచాక కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి అనిల్‌కు.. మంత్రి అయ్యాక కనిపించిన అనిల్‌కు చాలా తేడా ఉందనేది…