గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, జిల్లా ఎస్పీ, ఎన్నికల అధికారులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బు, మద్యంతో టీడీపీ ప్రలోభాలకు తెర లేపినా.. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారంటూ మండిపడ్డారు. సుమారు 300 మంది బౌన్సర్లతో టీడీపీ అభ్యర్థి బూత్‌లలో హల్చల్ చేసినా, రౌడీయిజం చేసినా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి…
రాష్ట్రంలో మహిళా పోలీస్ లకు సంబంధించి యూనిఫామ్ బాధ్యతలను ఔట్ సోర్సింగ్ కు అప్పచెప్పామని నెల్లూరు ఎస్.పి.విజయా రావు తెలిపారు. ఒక పురుషుడు కొలతలు తీసినట్లు తెలిసిన వెంటనే స్పందించి దానిని సరిదిద్దాం అన్నారు. మహిళా టైలర్లు..మహిళా పోలీస్ సిబ్బంది కూడా వారిలో ఉన్నారు. ఒక మీడియా ఫోటోగ్రాఫర్ నిబంధనలకు విరుద్దంగా ప్రాంగణంలోకి ప్రవేశించి ఫోటోలు తీశారన్నారు. మహిళల ప్రైవసీ కి భంగం కలిగించినందుకు చర్యలు తీసుకుంటాం. ఈ ప్రక్రియకు ఏ.ఎస్.పి వెంకటరత్నమ్మ ఇంచార్జి గా వున్నారు.…