రాష్ట్రంలో మహిళా పోలీస్ లకు సంబంధించి యూనిఫామ్ బాధ్యతలను ఔట్ సోర్సింగ్ కు అప్పచెప్పామని నెల్లూరు ఎస్.పి.విజయా రావు తెలిపారు. ఒక పురుషుడు కొలతలు తీసినట్లు తెలిసిన వెంటనే స్పందించి దానిని సరిదిద్దాం అన్నారు. మహిళా టైలర్లు..మహిళా పోలీస్ సిబ్బంది కూడా వారిలో ఉన్నారు.
ఒక మీడియా ఫోటోగ్రాఫర్ నిబంధనలకు విరుద్దంగా ప్రాంగణంలోకి ప్రవేశించి ఫోటోలు తీశారన్నారు. మహిళల ప్రైవసీ కి భంగం కలిగించినందుకు చర్యలు తీసుకుంటాం. ఈ ప్రక్రియకు ఏ.ఎస్.పి వెంకటరత్నమ్మ ఇంచార్జి గా వున్నారు. మహిళా పోలీసుల దుస్తుల కొలతలు తీసేందుకు మహిళలనే నియమించాం అని నెల్లూరు ఎస్.పి.విజయా రావు తెలిపారు.