నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామం ఘటనలో చనిపోయిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌లకు కూడా పరిహారం ఇవ్వనున్నారు. శాంతిభద్రతలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు అనిత, నారాయణ సహా…
Minister Nimmala: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనకు కులం రంగు పులిమి వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శవ రాజకీయాలు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తుందని అన్నారు.
ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో జగన్ పాలన ఆటవిక పాలనగా మారుతుంది. కోర్టులో కేసులో ఉన్న పత్రాలు దొంగిలించడం అరాచక పాలనకు పరాకాష్ఠ. పోలీసు కట్టుకధలు మరింత విస్మయానికి గురి చేస్తున్నాయన్నారు ఏపీసీసీ చీఫ్ సాకె శైలజనాథ్. ఎక్కడో బీహార్లో విన్న కధలు.. ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. దళిత బిడ్డలను చంపినా, కొట్టినా పట్టించుకోలేదు. నిన్న ఎస్పీ అంత అర్జంటుగా మీడియా సమావేశం పెట్టడం ఎందుకు..?వాళ్లు చెప్పిన అంశాలు నమ్మే విధంగా ఉన్నాయా..?ఎవరిచ్చారో…
అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీ అయింది. ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో జగన్ మోసపు రెడ్డి పాలన వల్లే అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం ఏర్పడిందన్నారు. జగన్ ఒక అపరిచితుడు.. తన రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్ అవుతోంది. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్ట్ కు శాపంగా మారాయి. నెల్లూరు కోర్టులో దొంగల వ్యవహారంలో…