NEET: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువుల వల్ల ఒత్తిడి, తల్లిదండ్రుల కలలను నేరవేర్చలేమో అనే దిగులుతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. రాజస్థాన్ కోటాలో ఇప్పటికే చాలా మంది పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తాజాగా 16 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కోటా నగరంలో ఇలా ఆత్మహత్యలకు పాల్పడటం విచారం కలిగిస్తోంది.