అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ విద్యార్థి మృతిచెందాడు. భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మృతి చెందినట్లు మంగళవారం విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిఫ్టన్ తెలిపారు. అతడి మృతదేహాన్ని క్యాంపస్‌లోని ఓ భవనం వద్ద గుర్తించామని పేర్కొన్నారు. కాలేజ్ మ్యాగజైన్ ‘ది ఎక్స్‌పోనెంట్’లోనూ ఈ ఘటనకు సంబంధించిన వార్తను ప్రచురించారు. నీల్ ఆచార్య మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆదివారం 12:30 నుంచి తన కుమారుడు కనిపించడం లేదని నీల్…