నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘కలియుగం పట్టణంలో’ రిలీజ్ కి రెడీ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ సినిమాను డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలు రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. ఈ సినిమాను డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.…