టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య ఉద్దేశం ఏంటని ఢిల్లీలో మీడియా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారని.. ఏపీలో గూండా గిరి, నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో అవినీతిని అంతమొందించేందుకు పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో భూకబ్జాలు అడ్డుకోవడానికి పొత్తు పెట్టుకున్నాం అని వెల్లడించారు. మరోవైపు.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.. ఏపీ రాజధానిగా అమరావతిని చేస్తామని స్పష్టం చేశారు అమిత్ షా
ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు.. రేపు మరోసారి ఏపీకి రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏపీలో పర్యటించబోతున్నారు.
ఉంగుటూరు మండలంలోని నందమూరు, మధిరపాడు, చికినాల్, బోకినాల, చాగంటిపాడు, వేంపాడు, తరిగొప్పుల గ్రామాల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. సూపర్ సిక్స్ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.
PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు రెండో దశ పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దశ ఎన్నికలు ఎన్డీయేకు కలిసి వచ్చిందని శుక్రవారం అన్నారు.
Lok Sabha Elections: స్వాతంత్య్ర భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ అతి తక్కువ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇండియా కూటమి సీట్ల షేరింగ్లో భాగంగా ఇతర పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని తాను తక్కువ స్థానాలకే పరిమితమైంది.
PM Modi: లోక్‌సభ తొలి విడత ఎన్నిల ఏప్రిల్ 19న జరగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి దశలో పోటీ చేస్తున్న బీజేపీ, ఎన్డీయే అభ్యర్థులకు వ్యక్తిగతంగా లేఖ రాశారు. ప్రధానమంత్రి సందేశం నియోజకవర్గంలోని ప్రతీ ఒక్కరికీ చేరేలా బీజేపీ కసరత్తులో ఈ లేఖ భాగంగా కనిపిస్తోంది.