PM Modi: గెలుపోటములు రాజకీయాల్లో భాగమే అని చివరి క్యాబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందు నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న ప్రధాని మోదీ బీజేపీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది .
ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయం సాధించింది. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా.. టీడీపీ నేతలు విజయానందంలో మునిగితేలుతున్నారు. కాగా.. విజయంపై కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటామని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ పై నమ్మకంతో ప్రతిపక్షమే లేని మెజార్టీని ప్రజలు ఇచ్చారని తెలిపారు.
PM Modi: ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపొందింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మంత్రిమండలితో సహా రాజీనామా సమర్పించారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది.
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. తన ఎక్స్ ఖాతాలో “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త ఎన్నికల విజయంపై, ఆయన చేస్తున్న మంచి పనికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. ఇక, వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ-ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి.
Lok Sabha Election Results 2024, bjp, Elections Results, Elections Results 2024, INDIA Bloc, Lok Sabha Elections Results, Lok Sabha elections-2024, NDA, PM Modi, Lok Sabha Election Results 2024 LIVE UPDATES
జూన్ 4.. ఇక స్టాక్ మార్కెట్లకు మంచిరోజులొస్తాయని.. ఇక తిరుగులేదని.. ఎన్నెన్నో కథనాలు.. ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. ఎన్నికల ఫలితాలతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఢమాల్ అయిపోయాయి.
Delhi: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు, బీజేపీ అనుకున్న విధంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మొత్తం 543 ఎంపీ సీట్లకు గానూ 2014, 2019లో బీజేపీ సొంతగానే మ్యాజిక్ ఫిగర్ మార్క్ 272ని దాటింది. అయితే, ఈ సారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం,
BJP: బీజేపీ చెప్పినట్లుగా ఎన్డీయే కూటమికి ‘‘400’’ సీట్లు రావడం లేదు. చివరకు 300కి దరిదాపుల్లోనే ఆగిపోయారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎంతో ఆశలు పెట్టుకున్న ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అనుకున్నంతగా ఫలితాలను సాధించలేదు. గత రెండు పర్యాయాలు 2014, 2019లో మొత్తం 543 ఎంపీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 272ని సొంతగా గెలుచుకున్న బీజేపీ ఈ సారి మాత్రం ఆ మార్కును చేరుకోలేకపోయింది.ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ…