2024 ఎన్నికలు ఒక చరిత్ర.. 9 నెలల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మరో చరిత్రగా అభివర్ణించారు సీఎం చంద్రబాబు నాయుడు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో కూడా రెండు టీచర్ సంఘాలకు ఓటు వేయమని చెప్పాం.. పని చేసే వారికే గెలుపు వరిస్తుంది. జనసేన తరపున పవన్ కల్యాణ్‌కు అభినందనలు.. బీజేపీ, జనసేన కార్యకర్తలు క్రమశిక్షణతో పని చేశారని పేర్కొన్నారు..