షనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కలిగిన అజిత్ పవార్ వర్గానికే పార్టీ చిహ్నం, గుర్తును ఈసీ కేటాయించింది.