NBK108: రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఆలోచనల్లో అనిల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తోన్న బాలయ్య.. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ (NBK108) చేయనున్న విషయం తెలిసిందే! ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సైతం చకచకా జరుగుతున్నాయి. తండ్రి, కూతురు మధ్య బంధం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూతురి పాత్రకు శ్రీలీలను ఎంపిక చేయడమూ జరిగింది. హీరోయిన్, ఇతర ప్రధాన నటీనటుల్ని ఎంపిక చేసి.. సెట్స్ మీదకి తీసుకెళ్లడమే తరువాయి.
ఈ క్రమంలోనే దర్శకుడు అనిల్ ఈ సినిమాకి ‘బ్రో ఐ డోన్ట్ కేర్’ అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దాదాపు ఈ టైటిల్ ఖరారైందనే వార్తలూ చక్కర్లు కొట్టాయి. స్క్రిప్ట్ డిమాండ్, బాలయ్య ఇమేజ్‌కి ఈ టైటిల్ సరిగ్గా సూటవుతుందని భావించి, అదే ఫిక్స్ చేయాలని అనిల్ డిసైడ్ అయ్యాడట! అయితే.. తాజా సమాచారం ప్రకారం బాలయ్యకు ఆ టైటిల్ నచ్చలేదట! టైటిల్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ, తెలుగుదనం లేదన్న భావనతో మార్చాలని ఆయన సూచించారట! దీంతో.. అనిల్ రావిపూడి ఏ టైటిల్ పెడితే బాగుంటుందా? అనే ఆలోచనల్లో పడినట్టు తెలుస్తోంది. ఒకసారి టైటిల్ ఫిక్స్ అయ్యాక, దాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.
Also Read
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
కాగా.. ఈ సినిమాను ఆగస్టులో సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య చేస్తోన్న NBK107 షూటింగ్ ముగిశాక కొంత గ్యాప్ తీసుకొని, NBK108కి పట్టాలెక్కించనున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కథానాయిక పాత్ర కోసం ఇంకా జల్లెడ పడుతూనే ఉన్నారు. ప్రియమణి పేరు తెరమీదకి వచ్చింది కానీ, ఇంకా కన్ఫమ్ అవ్వలేదు. మరి, మేకర్స్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!