గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కిన సినిమా ‘నయీం డైరీస్’. దీనిని డిసెంబర్ 10న విడుదల చేయనున్నారు. దాము బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వశిష్ఠ సింహ టైటిల్ రోల్ పోషించాడు. సీఏ వరదరాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ కు చక్కని స్పందన వచ్చింది. రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయన్నది ధైర్యంగా ఈ సినిమాలో చూపించామని దర్శకుడు దాము చెబుతున్నారు. నయీం…