బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు మీద వున్నారు. ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా భువనగిరి అంబేద్కర్ సర్కిల్ లో బండి సంజయ్ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సభకు భారీగా హాజరయ్యారు జనం. జాతీయవాదులు దేశభక్తులు బిజెపి వైపు చూస్తున్నారు..సర్వేలు బిజెపికి అనుకూలంగా ఉన్నాయి. సర్వేను చూసి కేసీఆర్ భయపడుతున్నారు..ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు.
కళ్యాణ లక్ష్మి నిధులు పెళ్లి అయిన తర్వాత దరఖాస్తు చేస్తే బిడ్డలు పుట్టాక వస్తుంది..బండి సంజయ్ కి భయపడే చేనేత బీమా ప్రారంభించారు..భువనగిరిలో అభివృద్ధి శూన్యం..రోడ్లు అధ్వానం… రోడ్ల విస్తరణ కొనసాగుతూనే ఉంది..డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం..శ్రీకాంతాచారిలాంటి వాళ్లు తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేస్తే ఆ ఫలితాలను కేసీఆర్ ఫ్యామిలీ అనుభవిస్తుందన్నారు బండి సంజయ్.
తెలంగాణ సర్కార్ ను చూసి.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగంచేసిన పోలీసు కృష్ణయ్య ఆత్మఘోషిస్తుంది..యువకుల బలిదానాలు జరగకూడదని బిజెపి తెలంగాణకు మద్దతు పలికింది..పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటు బిల్లు పెడితే ఓటు వేయని Sitaramam: ‘సీతారామం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (లైవ్)ఘనత కేసీఆర్ ది..పేదోడు ప్రాణ త్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చింది…నదులకు నడక నేర్పిన కేసీఆర్.. ప్రాజెక్ట్ లో మునిగిన మోటర్లకు ఈత నేర్పితే బాగుండేది..మిర్చి రైతులకు బేడీలు వేసిన ఘనత కేసిఆర్ ది..పోడు భూముల కోసం కోట్లాడుతున్న ఎస్టీలపై అక్రమ కేసులు పెడుతున్నారు..
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి..అక్రమాలు అక్రమాలకు అడ్డంగా తెలంగాణ మారింది. ల్యాండ్, సాండ్ మాఫియాగా ఎదిగారు టిఆర్ఎస్ నేతలు. నయీమ్ ని పెంచి పోషించింది ఎవరో అందరికీ తెలుసు.. 36 సంచులు నిండా నయీమ్ డబ్బు వచ్చింది. నయీమ్ డబ్బులు ఎక్కడికి పోయాయి…? నయీమ్ దగ్గర స్వాధీనం చేసుకున్న ఆస్తి, డబ్బులు, డాక్యుమెంట్లు అమ్మితే భువనగిరి నియోజకవర్గం అద్దంలా మారుతుంది. నయీమ్ డైరీ ఎక్కడ దాచారో స్పష్టం చేయాలి.
నయీమ్ బాధితులకు ఎందుకు న్యాయం చేయడం లేదు.. మునుగోడు ఉప ఎన్నికలకు అందరూ కలిసి రావాలి… మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఉపఎన్నిక.. ఈ ఉప ఎన్నికలు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది.. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే పథకాలు కేసీఆర్ కు గుర్తొస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తే పరిస్థితి ఉంది..మునుగోడు ఉప ఎన్నిక ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నిక కాదు..రైతుల కోసం, మహిళల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం సంబంధించిన ఉప ఎన్నిక అన్నారు బండి సంజయ్. మునుగోడు నియోజకవర్గంలో గడప గడపకు.. గల్లీ గల్లీకి ప్రతి కార్యకర్తలు తరలిరావాలి..
కుటుంబ పాలన అంతం కావాలి… లేకపోతే శ్రీలంక పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నక్సలైట్లు చంపేస్తామని వార్నింగ్ ఇచ్చిన వెనక్కి తగ్గని నైజం నాది.. తెలంగాణలో ఉన్న 80శాతం హిందువుల గురించి బిజెపి పనిచేస్తుంది ఆలోచిస్తుందన్నారు బండి సంజయ్. తెలంగాణ లో కల్వకుంట్ల రాజ్యంగం సమాధి చేసి అంబెడ్కర్ రాజ్యంగం తెస్తాం.. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం బిజెపి తో కలిసి రండి..వచ్చేది కాషాయ ప్రభుత్వం అన్నారు బండి సంజయ్.
Sitaramam: ‘సీతారామం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (లైవ్)