Venugopal Rao: మావోయిస్టులకు మరో భారీ దెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో సీపీఐ (మావోయిస్టు) పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను తనతో పాటు 60మంది మావోయిస్టు కేడర్లు ఆయుధాలు వదిలి లొంగిపోయారు. దండకారణ్య ప్రాంతంలో కీలక పాత్ర పోషించిన సోను లొంగిపోవడంతో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా బలహీనపడినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గత సెప్టెంబర్‌లో సోను ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, తాను మావోయిస్టు మార్గాన్ని వదిలి…
Maoist Party: పార్టీ క్యాడర్ కు మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ లేఖ రాశారు. సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి జగన్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు.
Maoist Special Story : మావోయిస్టు పార్టీ నానాటికి ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ..పార్టీ అగ్ర నాయకులను కోల్పోతుంది.. పార్టీ కేంద్ర నాయకత్వం పట్టు తప్పు పోతుంది.. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోగా ఇప్పుడు కిందిస్థాయి వాళ్లు కూడా ఎన్కౌంటర్లో చనిపోతున్నారు.. బతికున్న వాళ్లు చాలామంది లొంగిపోతున్నారు. మావోయిస్టు పార్టీ ఏర్పడిన వారు 44 మందితో కేంద్ర కమిటీ ఏర్పాటు అయింది ఇప్పుడు ఆ సంఖ్య 16కు తగ్గిపోయింది ఇందులో ఉన్నవాళ్లు చాలామంది ఎన్కౌంటర్లో చనిపోగా కొందరు…
Maoists : ములుగు జిల్లాలో నక్సలైట్ ఉద్యమానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం జిల్లాలో ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. వారు జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఎదుట తమ ఆయుధాలను వదిలి, సాధారణ జీవితం వైపు అడుగులు వేసే నిర్ణయం తీసుకున్నారు. లొంగుబాటు అయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా రూ.25,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడింది. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు…
Operation Karag : రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం, వేములనర్వ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పన్నెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న తమ గ్రామ యువతి విజయలక్ష్మి అలియాస్ భూమిక, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ఆపరేషన్ కగార్’లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు వార్తలు రావడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయలక్ష్మి ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడే ఆమె ఉద్యమాలకు ఆకర్షితురాలై, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబానికి దూరంగా, ఒక ఆశయంతో పయనించిన ఆమె జీవితం ఇలా…