Gun Firing: నవి ముంబైలోని సంపాదలోని డిమార్ట్ సమీపంలో శుక్రవారం ఉదయం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి 5-6 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రజలకు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో అక్కడున్న ప్రజల్లో భయాందోళన నెలకొనగా.. గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని…