ఎప్పుడూ వివాదాలతో వార్తల్లోకెక్కే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈసారి ఓ పోలీస్ కేసుతో తెరమీదకొచ్చారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఆయన నట్టి క్రాంతి, కరుణ అనే వ్యక్తులపై పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించిన వర్మ.. ‘మా ఇష్టం’ సినిమా సమయంలో తన సంతకాన్ని వాళ్ళు ఫోర్జరీ చేసినట్టు అందులో పేర్కొన్నారు. 2020 నవంబర్ 30వ తేదీన తన లెటర్ హెడ్ తీసుకొని, నకిలీ పత్రాల్ని సృష్టించి, ఫోర్జరీ…
ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటించిన చిత్రం ‘సైకో వర్మ’ (వీడు తేడా). ఈ చిత్రాన్ని శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మాణంలో నట్టి కరుణ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ ను మార్చమని సెన్సార్ అధికారి చెబుతున్నారని నట్టికుమార్ అన్నారు. ‘సైకో వర్మ’ టైటిల్ లో సైకో అన్న పదాన్ని తొలగించమని, లేకుంటే వేరే టైటిల్ పెట్టుకోమని సెన్సార్ వారు చెప్పారని ఆయన వెల్లడించారు. Read…