Bharat Bandh: దేశవ్యాప్తంగా బుధవారం (జూలై 9) భారత్ బంద్‌కు పిలుపు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెలో భాగస్వామ్యం కానున్నాయి. దాదాపు 25 కోట్ల మందికి పైగా కార్మికులు ఈ బంద్‌లో పాల్గొనబోతునట్లు సమాచారం. ఈ బంద్ పిలుపు 10 ప్రధాన కార్మిక సంఘాలు ఇచ్చాయి. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, రైతుల అభ్యున్నతికి విరుద్ధంగా ఉన్న నిర్ణయాలు, కార్పొరేట్…
Chalo Raj Bhavan: తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకోనుంది. ఈ రోజు హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం జరగనుంది. ఈ నిరసనల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అంతటా దేశవ్యాప్త సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ…
Doctors Protest: పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు గత 65 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. వారికి మద్దతుగా నేటి (అక్టోబర్ 14) నుంచి ఎలక్టివ్ సర్వీసులను బహిష్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆదివారం దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు, రెసిడెంట్ డాక్టర్లను కోరింది.
ఐటీ శాఖ నోటీసులపై కాంగ్రెస్ మండిపడుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.
పార్లమెంట్ నుంచి 146 మంది పార్లమెంట్ సభ్యులను స్పీకర్ ఓంబిర్లా సస్పెండ్ చేశారు. దీంతో ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా కూటమి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వామపక్షాలు, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు ప్రకటించాయి.