Andhra Pradesh: ఏకలవ్య మోడల్ స్కూల్స్ 3వ జాతీయ క్రీడా పోటీలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు ఏకలవ్య జాతీయ క్రీడలు జరగనున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం, లయోలా కాలేజీ, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, బీఆర్ స్టేడియంలో పోటీలు జరుగుతాయి. 15 వ్యక్తిగత విభాగాలు, 7 టీమ్ కేటగిరీల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. అండర్-14, అండర్-19 కేటగిరీల్లో జరిగే ఏకలవ్య జాతీయ క్రీడల్లో దేశవ్యాప్తంగా 5,970 మంది క్రీడాకారులు పాల్గొంటారు.…