టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రతి ఈవెంట్‌కు మెరుగువుతున్న అతడు స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లోనూ మెరిశాడు. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 89.94 మీటర్లు త్రో చేసి రజత పతకం కైవసం చేసుకున్నాడు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో గురువారం జరిగిన డైమండ్ లీగ్ పోటీలో పాల్గొన్న నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనేడియన్ అథ్లెట్ అండర్సన్ పీటర్సన్ 90…