Man swallows keys: బీహార్ మోతిహారికి చెందిన ఓ వ్యక్తి తాళంచెవి, కత్తి, రెండు నెయిల్ కట్టర్‌ని మింగేశాడు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడేందుకు అతడి కుటుంబం నిరాకరించడంతో ఈ చర్యకు ఒడిగట్టాడు. పరిస్థితి తీవ్రంగా మారడంతో అతనికి వైద్యులు 1.5 గంటల పాటు శస్త్రచికిత్స చేసి, కడుపులో ఉన్న వస్తువుల్ని బయటకు తీశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Kolkata Doctor Murder Case: ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష ప్రారంభమైంది. కోల్‌కతా లోని సీబీఐ కార్యాలయంలో నిందితుడు సంజయ్ రాయ్, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, ఘటన జరిగిన రాత్రి బాధితురాలితోపాటు నలుగురు వైద్యులను.. అలాగే, ఒక వాలంటీర్ లకు పాలిగ్రాఫ్ పరీక్షలు చేపడుతున్నారు. ఇకపోతే నిందితులు నిజాన్ని…