కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జూన్ 19న తన 55వ పుట్టినరోజును అత్యంత సరళంగా జరుపుకున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు. రాహుల్ తన నివాసం 24 అక్బర్ రోడ్‌లో కార్యకర్తలు, నాయకులను కలిశారు. అక్కడ వాళ్లు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేయడానికి నిరాకరించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం అని డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది అని పవన్ కళ్యాణ్ ఒక…
జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లోని బైసరన్‌లో మంగళవారం హృదయ విదారక ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటి వరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆ బృందం సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకుంది.
Manmohan Singh Last Rites: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆయన అంతిమ యాత్రకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భారత దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కు వయసు 92 ఏళ్లు. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం తెల్లవారుజామున మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ,…
మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. కాన్సర్ట్ హాల్‌లో జరిగిన దాడిలో 150 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనను ఆయన అనాగరిక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.