దేశానికి ఇందిరా గాంధీ లాంటి పౌరుషం ఉన్న ప్రధాని కావాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 50 ఏండ్ల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇందిరమ్మ ఉందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు.