మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణె నగరంలో 46 ఏళ్ల డాక్టర్, ఆయన టీనేజ్ కుమార్తెకు జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు నిర్ధరణ అయింది. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బుధవారం ఒక అధికారి తెలిపారు. ఆ వైద్యుడికి ఇటీవల జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.
Monkeypox Cases In India: ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 78 దేశాల్లో 18 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఇండియాలో కూడా నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళకు చెందిన ముగ్గురితో పాటు.. ఢిల్లీలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే దేశంలో మొదటిసారిగా మంకీపాక్స్ వైరస్ ను పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్స్టిట్యూట్…
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కలవరపెడుతోంది మంకీపాక్స్ వ్యాధి. ఇప్పటికే 58 దేశాల్లో 6000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా యూకే, స్పెయిన్, జర్మనీ, ప్రాన్స్ వంటి యూరోపియన్ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 85 శాతం కేసులు ఒక్క యూరోప్ ఖండంలోనే నమోదు అయ్యాయి. తాజాగా ఇండియాలో మంకీపాక్స్ కేసుల నమోదు అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోల్ కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన విద్యార్థికి మంకీపాక్స్ సోకినట్లు వైద్యులు…