2027లో ఏపీలో జాతీయ క్రీడలు నిర్వహించాలనే సంకల్పంతో ఉన్నాం అన్నారు ఏపీ స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవి కుమార్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో అధునాతన క్రీడా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు నిర్దేశించారు. ఏపీలో పలు జిల్లాల్లో హాస్టల్ వసతులుతో కూడిన క్రీడా శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తాం. “ఖేలో ఆంధ్ర ప్రదేశ్” గా ఏపీని తీర్చిదిద్దడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం అన్నారు.
PM Modi to inaugurate National Games 2023 in Goa Today: ఇండియన్ ఒలింపిక్స్‌గా పిలిచే ‘నేషనల్ గేమ్స్’ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. జాతీయ క్రీడలకు (నేషనల్ గేమ్స్) తొలిసారిగా గోవా ఆతిథ్యం ఇస్తోంది. 37వ ఎడిషన్ జాతీయ క్రీడలు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు జరగనున్నాయి. నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నేషనల్ గేమ్స్ ఆరంభం కానున్నాయి. దేశంలోని అత్యుత్తమ క్రీడాకారులను, అథ్లెట్లను వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే…
National Games: అహ్మదాబాద్‌లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో గుజరాత్‌లోని వడోదరకు చెందిన 10ఏళ్ల బాలుడు శౌర్యజిత్ ఖైరే చరిత్ర సృష్టించాడు. మల్లఖంబ్ క్రీడల్లో కాంస్య పతకం సాధించి జాతీయ క్రీడల్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మల్లఖంబ్ క్రీడల్లో బాలుడి విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శౌర్యజిత్ విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గుజరాత్ సంప్రదాయ క్రీడ అయిన మల్లఖంబ్‌కు ఇటీవలే జాతీయ క్రీడల్లో…