బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో వేదిక కూడా ఖరారు చేశారు. జూలై 2,3 తేదీల్లో కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అగ్రనేతలందరూ హాజరుకానున్నారు. ఇప్పటికే కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆదేశాలు అందాయి. వచ్చే ఎన్నికలను ప్రభావితం…