మోదీ 3.0 పై ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ క్రమంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగానే నేటి నుంచి బీజేపీ జాతీయ సమావేశాలు రెండు రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో జరగనున్నాయి.
భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో జాతీయ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల సమావేశాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు 11, 500 బీజేపీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.